![]() |
![]() |
.webp)
బ్రహ్మముడి సీరియల్కి కథానాయికైన కనకం రెండో కూతురు కావ్య.. సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ఆమె దుగ్గిరాల వారి ఇంటికి ఆరిపోని దీపం. అలాంటి దీపాన్ని ఆర్పేయడానికి, తరిమేయడానికి కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె పేరు ఇంకా రివీల్ కాలేదు కానీ.. ఆమెను ఆమె ముద్దుగా ‘బేబీ.. బేబీ’ అని పిలుస్తోంది. అయితే ఈ విలన్ని చూసి రాజ్ ఎందుకు కంగారుపడ్డాడు అనేది కథలో కీలకంగా మారింది.
బ్రహ్మముడి సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేసింది. ఆమెను చూసి రాజ్ కంగారుపడటం చూసిన ఎవరికైనా తనకి రాజ్ కి గతంలో ఏదో సంబంధం ఉందని తెలుస్తుంది. అయితే ఆమెనే గుర్తుచేసుకుంటూ కావ్యతో మాట్లాడిన మాటలు వింటే ఏదో ఉందనే భావనే కల్గుతుంది. నిన్ను నన్ను ఎవరు దూరం చేయలేరు.. ఒకవేళ దూరం చూసిన నువ్వు నన్ను దక్కించుకుంటావని కావ్యతో రాజ్ అంటాడు. అలాగే ఆ కొత్త అమ్మాయి కూడా తన ఫ్యామిలీతో మాట్లాడుతుంది. ఇతని పేరు రాజ్.. ఇతన్నే పెళ్ళి చేసుకుంటా అని అనడంతో ఆమె తల్లిదండ్రులు ఒకే అంటారు. ఆయితే రాజ్ భార్యని పెళ్లికి ఒప్పించాలని ఆమె చెప్పగా వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. దీంతో బ్రహ్మముడి సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది.
నిన్న మొన్నటిదాకా రుద్రాణి, అనామిక కలిసి విలన్ రోల్స్ చేయగా.. ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి రాజ్ ని దక్కించుకోవడం కోసం ఎన్ని కుట్రలు చేస్తుందో.. కావ్య, రాజ్ లని విడదీస్తుందా లేక రాజ్ ని బ్లాక్ మెయిల్ చేస్తుందా చూడాలి మరి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరనేది తెలియాలంటే నేటి కథనం వచ్చేవరకు వేచిఉండాల్సిందే.
![]() |
![]() |